
కూకట్పల్లి, వెలుగు: కూకట్ పల్లిలో ట్యాంకర్‌నుంచి ప్రైవేట్ట్రావెల్స్బస్సులోకి డీజిల్నింపుతుండగా మంటలు చెలరేగాయి. ట్యాంకర్ తోపాటు సమీపంలోని కారు దగ్ధమైంది. కూకట్పల్లి ఐడీఎల్చెరువు కట్ట కింద కావేరి ట్రావెల్స్‌కు పార్కింగ్ స్థలం ఉంది. అందులో వారి బస్సులను పార్క్ చేస్తుంటారు. ప్రతిరోజూ ప్రత్యేకంగా ఒక డీజిల్ట్యాంకర్ వచ్చి బస్సుల్లో డీజిల్నింపి వెళ్తుంది. ఆదివారం ఉదయం 7.30 గంటలకు డీజిల్ట్యాంకర్వచ్చి ఓ బస్సుల్లో డీజిల్నింపుతుండగా మంటలు చెలరేగాయి.
ట్యాంకర్‌తోపాటు కొంతకాలంగా అక్కడే పార్క్‌చేసి ఉంచిన కారుకు మంటలు వ్యాపించాయి. చూస్తుండగానే రెండూ దగ్ధమయ్యాయి. ఫైర్‌సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. బస్సు ఇంజిన్ఆన్చేసి ఉండడంతో వెంటనే ముందుకు తీసుకెళ్లి ఆపారు. బస్సు ఇంజిన్ఆన్లో ఉండడమే ప్రమాదానికి కారణం అని తెలిసింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.